Comedian Raghu: కమెడియన్ రఘు ఇంటిని చూశారా.. సినిమాల్లేవ్.. కామెడీ షోస్ లేవ్.. ఇదెలా సాధ్యం…!

Comedian Raghu Luxirious House
Source: Suman TV

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీస్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు సెలబ్రిటీస్‌ ఇళ్లను చూపించే పనిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పడ్డాయి. తాజాగా కమెడియన్ కారుమంచి రఘు (Comedian Raghu) ఇంటిని చూపించారు. అది చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఎందుకంటే అది ఇల్లా ఇంద్ర భవనమా? అన్నట్టుగా ఉంది. విశాలమైన ఇల్లు… ఇంట్లో ఎక్కడ చూసిన మొక్కలు.. రూఫ్ గార్డెన్. కూరగాయలు అన్నింటినీ ఇంట్లోనే పండించుకుంటారు.

Comedian Raghu Luxirious House
Source: Suman TV

మొత్తానికి రఘు (Comedian Raghu)ది ఒక లగ్జరీ హౌస్. అసలు రఘు ఇల్లు అంత బాగుంటుందని ఎవరూ ఊహించలేదు. స్టార్ హీరోల రేంజ్‌లో కట్టేశాడు. ఏదో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటా? అంటే అదీ కాదు. ఇండివిడ్యువల్ హౌస్. పోనీ ఏమైనా దిక్కు మొక్కూ లేని ప్లేస్‌లో కట్టుకున్నాడా? అంటే అదీ కాదు.. ఖరీదైన ఏరియాలో ఉన్నతమైన కమ్యూనిటీ మధ్య రఘు (Comedian Raghu) ఇల్లు ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. మొత్తానికి రఘు (Comedian Raghu) హోమ్ టూర్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా పెద్ద చర్చకు దారి తీసింది.

Comedian Raghu Luxirious House
Source: Suman TV

రఘు (Karumanchi Raghu) తన ఇంటిని అంత గొప్పగా నిర్మించుకోవడానికి కారణం ఏంటి? అతనేమైనా వందల కొద్దీ సినిమాలు చేశాడా? అంటే అదీ లేదు. జబర్దస్త్‌లో కూడా ఎంతో కాలం నిలదొక్కుకోలేకపోయాడు. పైగా వ్యసనాల కారణంగా చాలా సినిమాలు కోల్పోయాడనే టాక్. అలాంటి రఘు (Karumanchi Raghu) ఇంత గొప్పగా ఇంటిని ఎలా నిర్మించుకోగలిగాడు? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే అసలు విషయం ఏంటంటే.. రఘు (Comedian Raghu) కి తెలంగాణలో రెండు వైన్ షాపులు ఉన్నాయట. ఆ ద్వారా వచ్చిన డబ్బుతోనే కోట్లకు పడగలెత్తాడట . ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే ఇంత పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడని టాక్.

Google News