Women’s Day Special : సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీరు చూశారా..!?
ఒకప్పటితో ఇప్పుడు ఇప్పుడు దేశం చాలా మారింది. అప్పట్లో మహిళలు కేవలం వంటింటి కుందేళ్లుగానే ఉండేవారు. ఆ తరువాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు కూడా మారుతూ.. అన్ని రంగాల్లోనూ అడుగు పెడుతూ సత్తా చాటుతున్నారు. మరోవైపు సినిమా రంగంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు హీరో చుట్టే కథలు తిరిగేవి. కానీ ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా బాగా వస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా అద్భుతమైన లేడీ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని మీకోసం..
‘అంతులేని కథ’ (Anthuleni Katha)
‘అంతులేని కథ’ 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించినప్పటికీ కీలకం మాత్రం జయప్రద పాత్రే. కుటుంబం కోసం ఆమె చేసిన త్యాగాల నేపథ్యంలో కథ సాగుతుంది.
‘మయూరి’ (Mayuri)
ఇది ఒక క్లాసికల్ డ్యాన్సర్ (సుధా చంద్రన్) రియల్ స్టోరీ. ఒక ఇన్‌స్పైరింగ్ రియల్ స్టోరీ. ఆమె ఒక ప్రమాదంలో తన కాలును పోగొట్టుకుంటుంది. ఆ తరువాత ఆర్టిఫిషియల్ లెగ్‌తో తిరిగి డ్యాన్స్‌ను కొనసాగించడం. ఉవ్వెత్తున ఎగిసి నేలకొరిగిన తర్వాత.. తిరిగి అంతే స్పీడుతో ఎగిసిన తీరు ఆకట్టుకుంటుంది.
‘ఒసేయ్ రాములమ్మ’ (Osey Ramulamma)
దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఒక పెద్ద హిట్. ఒక గిరిజన యువతి తమపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకంగా భూస్వామ్యులతో ఎలా పోరాడిందన్నదే ఈ చిత్రం. అప్పటి నుంచి విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ అన్న పేరు స్థిరపడిపోయింది.
‘అమ్మ రాజీనామా’ (Amma Rajinama)
1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన ఓ కుటుంబ కథా చిత్రం ‘అమ్మ రాజీనామా’. తల్లిని విలువను తెలిపే సినిమా. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ కొడుకులు, కోడళ్లు.. వారి పిల్లల కోసం శ్రమించే తల్లి.. ఒక్కసారిగా తన బాధ్యతలకు రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా.