KGF: కేజీఎఫ్ పై వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ డైరెక్టర్

Director Comments On Kgf

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలను సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ వేలెత్తి చూపే సాహసం చేయరు. కానీ టాలీవుడ్‌ దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha)మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కేజీఎఫ్’ (KGF) చిత్రాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ చర్చా వేదిక నిర్వహించింది. దీనిలో దర్శకులు శివా నిర్వాణ, వివేక్‌ ఆత్రేయ, నందినిరెడ్డి, మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి, వెంకటేశ్‌ మహా పాల్గొన్నారు.

ఈ చర్చా వేదికగా వెంకటేశ్‌ మహా (Venkatesh Maha).. ‘కేజీయఫ్‌’ (KGF)పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడని… అలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక కన్నడ ప్రేక్షకులు ఊరుకుంటారా..? పెద్ద ఎత్తున రచ్చకు తెరదీశారు. వెంటనే వెంకటేశ్ మహా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Venkatesh Maha Comments On

సోషల్ మీడియా వేదికగా వెంకటేశ్ మహాపై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆయన స్పందించక తప్పలేదు. తాజాగా దీనిపై ఆయన మాట్లాడుతూ.. తాను మాట్లాడిన విషయాలపై అభిమానులు వ్యక్తపరుస్తున్న భావోద్వేగాలను తాను గౌరవిస్తానని వెల్లడించారు. ‘మీరు చూసింది కేవలం రెండు నిమిషాల క్లిప్ మాత్రమే.. అది చూసి నాతో పాటు ఉన్న దర్శకులను సైతం ట్రోల్ చేయడం దారుణం. వాళ్లంతా తెలుగు ఇండస్ట్రీలోనే గొప్ప దర్శకులని.. వాళ్లను ట్రోల్ చేయడం సరికాదు’ అని ఆయన సూచించారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!