Janhvi Kapoor: ఎన్టీఆర్ 30 కోసం జాన్వీ కపూర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందో తెలిస్తే..

Janhvi Kapoor remunaration for NTR 30 movie

తెలుగు వాళ్లకు మన హీరోయిన్స్ పనికిరారు. బాలీవుడ్ నుంచో మరో ఇండస్ట్రీ నుంచో వస్తేనే వాళ్లకు ఆనతారు. ఇక టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం తెలుగు హీరోయిన్స్‌ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. రెమ్యూనరేషన్ ఎంతైనా సరే ఇచ్చేసి ఏ బాలీవుడ్ నుంచో కోలీవుడ్ నుంచో పట్టుకొస్తారు. అందునా ఇప్పుడు పాన్ ఇండియా టైమ్. అన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకోవాలి. హీరో మన వాడైనా.. హీరోయిన్ మాత్రం వేరే ఇండస్ట్రీ నుంచి వస్తేనే సినిమాకు అక్కడ కూడా క్రేజ్ పెరుగుుతంది. 

అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకుని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva).. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)ను రంగంలోకి దింపారు. అమ్మడిని టాలీవుడ్‌కి తీసుకురావాలని ఇప్పటికే ఎంతో మంది ప్రయత్నించారు కానీ అమ్మడు మాత్రం చిటారు కొమ్మన కూర్చొంది. తెలుగు సినిమాలో నటించేదే లేదన్నట్టుగా నడుచుకుంది. ఇక ఇన్నాళ్లకు భారీ రెమ్యూనరేషన్ ఆశ చూపి ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ 30 (NTR30) వ ప్రాజెక్టులో కొరటాల శివ ఓకే చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ సినిమాతోనే ఆమె (Janhvi Kapoor) టాలీవుడ్ ఆరంగ్రేట‌మే కాదు.. సౌత్ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది.

Janhvi Kapoor remunaration for NTR 30 movie

ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. ఎన్టీఆర్ 30 (NTR30) లో జాన్వీ (Janhvi Kapoor) రెమ్యూనరేషన్ ఎంత? ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు జాన్వీకి రు. 5 కోట్లు ఆఫ‌ర్ చేశారట నిర్మాతలు. అలా చెప్పిన తర్వాతనే సినిమాలో నటించేందుకు ఒప్పుకుందట. లేదంటే బాలీవుడ్‌ని వదిలి వచ్చేదే లేదని పట్టుబట్టుకు కూర్చొంది. నిజానికి అమ్మడి (Janhvi Kapoor)కి రూ.5 కోట్లంటే చాలా ఎక్కువ. కానీ అంత మొత్తం ఇస్తే తప్ప ఒప్పుకునేలా లేదని ఓకే చెప్పారట. బాలీవుడ్ భామ‌లు సౌత్ సినిమాల్లో చేయ‌డం అంటేనే కోట్లు డిమాండ్ చేసేస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!