Krithi Shetty: కృతి శెట్టిని దాచేసిన ఓ చిత్ర యూనిట్.. కారణం ఏంటంటే..

Krithi Shetty in Sharwanand Movie

ఉప్పెన (Uppena Movie) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి (Krithi Shetty). అప్పట్లో అమ్మడి క్రేజే వేరు. ఈ మధ్య కాలంలో కాస్త సినిమాలు తగ్గడంతో పాటు అమ్మడి క్రేజ్ కూడా తగ్గింది. అయితే క్రేజ్‌ది ఏముంది? ఒక మంచి హిట్ పడిందంటే మళ్లీ పరిగెత్తుకుని వస్తుంది. ప్రస్తుతానికి అమ్మడి చేతిలో కొన్ని చిత్రాలైతే ఉన్నాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక ఆసక్తికర విషయంపై చర్చ జరుగుతోంది. అమ్మడిని ఎందుకోగానీ ఒక నిర్మాణ సంస్థ దాచేసింది.

దాచేయడం ఏంటి? అది కూడా ఒక నిర్మాణ సంస్థ అని అనిపిస్తోందా? అసలు విషయం తెలిస్తే డౌట్స్ క్లియర్ అవుతాయి. మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం కృతి శెట్టి (Krithi Shetty) శర్వానంద్ (Sharwanand) సరసన ఒక చిత్రంలో నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇక నిన్న శర్వానంద్ (Sharwanand) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఒక వీడియో క్లిప్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో కృతి శెట్టి (Krithi Shetty)ని కనిపించనివ్వలేదు.

Actress Krithi Shetty

హీరోని హీరోయిన్ డాష్ ఇవ్వగానే ఇద్దరిలో కరెంట్ పాస్ అయ్యే ఒక రొమాంటిక్ సీన్‌ను వీడియో క్లిప్‌లో చూపించారు. అయితే ఈ క్లిప్‌లో శర్వా కనిపించాడు కానీ కృతి (Krithi Shetty)ని మాత్రం స్పష్టంగా కనిపించనివ్వలేదు.. దీనికి కారణం లేకపోలేదు. కృతి శెట్టి పేరుని నిర్మాణ సంస్థ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి.. ఆమె పేరును ప్రకటించిన మీదట.. ఆమె ఫస్ట్ లుక్ ని సెపరేట్‌గా విడుదల చెయ్యాలనేది ప్లాన్‌ అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్తగా కనిపిస్తారట. కాబట్టి సెపరేట్‌గా కృతిని చూపిస్తారని టాక్.

Google News