Manchu Manoj: మంచు మనోజ్ పెళ్లితో పొలిటికల్ ఎంట్రీకి రూట్ క్లియర్ అయినట్టేనా?
మంచు మనోజ్ (Manchu Manoj) ఈ నెల 3న తేదీన భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy)ని వివాహమాడిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. అయితే ఈ పెళ్లితో మనోజ్ (Manoj) పొలిటికల్ ఎంట్రీకి కూడా లైన్ క్లియర్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లి అనంతరం తన భార్యతో కలిసి తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాడు. ఇక అక్కడి నుంచి మౌనిక తరుఫున బంధువులను కలుస్తున్నాడు.
ఇక తాజాగా మౌనిక (Bhuma Mounika Reddy) సొంత ప్రాంతమైన ఆళ్లగడ్డ వెళ్ళాడు. ఈ క్రమంలో అక్కడ జరిగిన హంగామాని బట్టి మంచు మనోజ్ (Manchu Manoj) తెలుగుదేశంలో చేరుతారా అన్న అనుమానం కలుగక మానదు. అప్పట్లో మౌనికా రెడ్డి తల్లిదండ్రులు సైతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వారి మరణానంతరం భూమా అఖిల ప్రియ కూడా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అప్పట్లో ఆమె పర్యాటక శాఖని చూశారు. మౌనిక కూడా సోదరి బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది అని అంటున్నారు.
ప్రస్తుతం మౌనికారెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి మనోజ్ (Manchu Manoj(), మౌనిక (Bhuma Mounika) కూడా టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు భార్య.. ఏపీ సీఎం జగన్‌కి దగ్గర బంధువు. కాబట్టి మంచు విష్ణు వైసీపీకి ఫేవర్‌గా వ్యవహరిస్తుంటాడు. మా ఎన్నికల్లో సైతం విష్ణుకి జగన్ పరోక్షంగా సపోర్ట్ అందించారనే ప్రచారం జరిగింది. ఇక మోహన్ బాబు సైతం వైసీపీకి సపోర్ట్‌గానే ఉన్నారు. ఇక మంచు మనోజ్ టీడీపీలో చేరుతారో లేదంటే ఇది కేవలం ప్రచారం మాత్రమేనో చూడాలి.
ఇదీ చదవండి: మంచు మనోజ్ .. మౌనికకు ఇందుకే పడిపోయాడా.. పెద్ద కథే ఉందిగా..!
మంచు మనోజ్ ఏ పార్టీలో చేరతారని మీరు భావిస్తున్నారు ?
- తెలుగుదేశం (0%, 0 Votes)
- వైఎస్సార్సీపీ (0%, 0 Votes)
- కాంగ్రెస్ (0%, 0 Votes)
- జనసేన (0%, 0 Votes)
Total Voters: 0