Manchu Manoj: మంచు మనోజ్ .. మౌనికకు ఇందుకే పడిపోయాడా.. పెద్ద కథే ఉందిగా..!

Manchu Manoj and Bhuma Mounika Reddy

మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika)ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అసలు మౌనిక‌ (Bhuma Mounika)ను మంచి మనోజ్ ఎందుకు ఇష్టపడ్డాడు? కారణం ఏంటనేది తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? నిజానికి మౌనికకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సేవా ధృక్పథం కూడా వచ్చేసిందట. తమ ప్రాంతంలో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే తక్షణమే ఆపన్న హస్తం అందిస్తుందట. ఇక మనోజ్ విషయానికి వస్తే ఆ కుటుంబానికి అతను కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. 

Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding

ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెంటనే వెళ్లిపోయే మనస్తత్వం మంచు మనోజ్‌ (Manchu Manoj)ది ఈ మనస్తత్వమే వారిద్దరినీ కలిపినట్టు తెలుస్తోంది. ఇక మౌనిక (Bhuma Mounika) రాజకీయాల్లో సైతం అవసరమైనప్పుడు యాక్టివ్ పార్ట్ పోషిస్తుంది. 2017లో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి తరుఫున ప్రచారం చేశారు. చక్కగా మాట్లాడుతూ.. ఆమె ప్రచారం నిర్వహించారు. త్వరలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ కూడా అప్పట్లో నడించింది. 

Manchu Manoj and Bhuma Mounika Reddy

అంతేకాకుండా మనోజ్ (Manchu Manoj) మాదిరిగానే స్నేహానికి మౌనిక చాలా ప్రాధాన్యమిస్తారట. ఈ అంశాలన్నీ నచ్చే మనోజ్ (Manchu Manoj) ఆమెతో ప్రేమలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఎప్పటి నుంచో వీరిద్దరూ మంచి మిత్రులే కావడంతో ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉంది. మంచు మనోజ్ తొలి వివాహానికి ముందు నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వేరే వివాహాలు చేసుకున్నారట. ఏదైనేమి చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!