Samantha: సమంత ఓ స్టార్ హీరో వద్ద రూ.50 కోట్లు అప్పు తీసుకుందా?.. అందులో నిజమెంత?

Samantha

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఓ స్టార్ హీరో వద్ద అప్పు తీసుకుందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌గా మారేందుకు యత్నిస్తోంది సామ్. ఈ సమయంలో ఆమె (Samantha Ruth Prabhu) గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరో వద్ద ఆమె రూ.50 కోట్లు అప్పుగా తీసుకుందట. అది కూడా తన తండ్రి చేసిన అప్పును తీర్చేందుకని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిలో నిజమెంత?

రెండు, మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన సమంత (Samantha)కు రూ.50 కోట్లు ఒక లెక్కా? పైగా తన తండ్రి చేసిన అప్పులను తీర్చేందుకు తీసుకుందంటూ ప్రచారం.

నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల అనంతరం ఫైనాన్షియల్‌గా సామ్ (Samantha) దెబ్బతిన్నదేమీ లేదు. పైగా వారిద్దరూ కలిసి నివాసమున్న ఇంటినే తీసుకుని హ్యాపీగా ఉంటోంది. ఆ తరువాత సామ్ (Samantha) చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అద్భుతమైన విజయం సాధించాయి. అమ్మడికి ఫైనాన్షియల్‌గా కూడా బాగా కలిసొచ్చాయి.

Samantha 3

పైగా ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. కోలీవుడ్‌లో సైతం రాణిస్తోంది. మరి అలాంటప్పుడు అమ్మడి (Samantha)కి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక్క సినిమా చేస్తే వచ్చి పడతాయి. దీనికోసం అప్పు తీసుకుందా? పైగా స్టార్ హీరో వచ్చేసి సమంత (Samantha Ruth Prabhu) అందం చూసి డబ్బు ఇచ్చాడంటూ కామెంట్స్.. కొంచెం కూడా కామన్‌సెన్స్ లేకుండా చేస్తున్న కామెంట్స్. అప్పు తీసుకుందన్న విషయంలో అసలు ఏమాత్రం నిజం లేదని.. ఇది కేవలం ప్రచారమేనని తెలుస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!