Venu Yeldandi-Dil Raju: వేణుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు

Venu Yeldandi, Dil Raju

ఆసక్తికరమైన ప్రాజెక్టులను తెరకెక్కించడంలో దిట్ట దిల్ రాజు (Dil Raju). పెద్ద, చిన్న సినిమాలన్న తారతమ్యం కూడా కథ నచ్చితే చాలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఆయన ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. అందుకే నిర్మాతగా మంచి సక్సెస్ సాధించారు. ఆయన ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తాజాగా మరో దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన మరెవరో కాదు ప్రముఖ కమెడియన్ వేణు (Venu Yeldandi).

కమెడియన్ వేణు (Comedian Yeldandi) దర్శకత్వంలో ‘బలగం’ (Balagam) అనే సినిమా రూపొందింది. ఒక మంచి సందేశంతో వేణు ఈ సినిమాను తీసినట్టు తెలుస్తోంది. ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌పై హన్షిత, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. వేణుపై ప్రశంసల జల్లు కురిపించారు.

Venu Yeldandi

‘బలగం’ కథ విన్నప్పుడే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని ఫిక్స్ అయినట్టు దిల్ రాజు (Dil Raju) తెలిపారు. ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలతో పాటు మంచి సందేశం కూడా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని వేణు (Venu Yeldandi) కథ చెప్పినప్పుడే అతనిలో మంచి దర్శకుడు ఉన్నాడని గ్రహించానని చెప్పుకొచ్చాడు. అనుకున్న దానికంటే కాస్త బడ్జెట్ ఎక్కువైందని.. కానీ ఈ సినిమా తమకు మంచి ప్రాఫిట్స్‌ను తెచ్చిపెడుతుందన్నారు. ఇదే బ్యానర్‌లో వేణుతో మరో సినిమాను సైతం చేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు.

Google News