Rajamouli: RRR ఆస్కార్ కి వెళ్ళడం తప్పా.. పాపం.. రాజమౌళిపై ఇంతలా పగ పట్టారేంటి

Rajamouli RRR

ఒకడిపై బురద చల్లాలంటే.. అది కూడా బాగా ఎదుగుతున్న వాడిపై బురద జల్లాలంటే కొందరు ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఆకాశంపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో మరిచి మరీ బురద చల్లుతూ ఆనందిస్తోంది ఓ మీడియా సంస్థ. రాజమౌళి(SS Rajamouli) కెరీర్‌లోనే ఇప్పటి వరకూ ఫ్లాఫ్ అనేది లేదు. ఇక ట్రిపుల్ ఆర్‌ (RRR)ను ఏకంగా ఆస్కార్ రేంజ్‌కి తీసుకెళ్లారు. ఒక తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళిదే.

Ram Charan, NTR in RRR Movie

అయితే ఎందుకో గానీ ఓ మీడియా సంస్థకు ట్రిపుల్ ఆర్ (RRR) నచ్చలేదు. మరీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)లను కలిపి తీయడం ఇష్టం లేదో మరొకటో కానీ ఆది నుంచి బురద చల్లడం ప్రారంభించింది. ఈ సినిమా రివ్యూ సమయంలో ఫ్లాఫ్ అని పేర్కొంటూ 2.5 రేటింగ్ ఇచ్చి రచ్చ చేసింది. అంతటితో ఆగిందా? సినిమా కొనుక్కున్న వాళ్లకు నష్టాలేనంటూ దారుణమైన రాతలకు వెనుకాడలేదు. ఇక ఇప్పటికీ కూడా ఇంకా విషం చిమ్ముతూనే ఉంది.

Rajamouli RRR

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌ (Oscar)కు వెళ్లడంతో మరో మారు తన అక్కసునంతా వెళ్లగక్కింది. రాజ‌మౌళి (Rajamouli) హాలీవుడ్ మీడియా వాళ్లతో బేరాలు కుదుర్చుకున్నారంటూ పిచ్చి రాతలు స్టార్ట్ చేసింది. మొత్తానికి ఆస్కార్ భారం 70 – 80 కోట్లు అవుతుందని.. అదంతా నిర్మాతల నెత్తి మీదే పడుతుందని తెలిపింది. మన తెలుగు వాడు అంతటి ఘన విజయాన్ని సాధిస్తే ప్రశంసల్లో ముంచెత్తాల్సింది పోయి ఈ చెత్త రాతలేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!