Allu Arjun: మరో 3 సినిమాలు లాక్ చేసిన బన్నీ.. అవి ఎలా ఉంటాయంటే…

Allu Arjun Next Movie

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో రూపొందిన ‘పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలియనిది కాదు. ఈ సినిమా రిలీజ్ అనంతరం కాస్త రిలాక్స్ అయిన బన్నీ తిరిగి ‘పుష్ప 2’ (Pushpa-2)లో నిమగ్నమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ సినిమా తర్వాత ఏంటి? అన్న ప్రశ్నకు కూడా అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పటికే సమాధానం ఇచ్చేశాడు. మూడు సినిమాలకు బన్నీ సైన్ చేసినట్టు సమాచారం. తొలుత వేణు శ్రీరామ్‌తో కూడా సినిమా ఉన్నట్టు వార్తలు వచ్చినా అది కేవలం ప్రచారమేనని సమాచారం.

ఇక మరి బన్నీ (Allu Arjun) సైన్ చేసిన మూడు సినిమాలు ఏంటనేగా మీ సందేహం. ‘పుష్ప 2’ (Pushpa2) తర్వాత తన ఫెవరేట్ దర్శకుడు త్రివిక్రమ్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు బన్నీ.

Allu Arjun Next Movie

ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sundeep Reddy Vanga) డైరెక్షన్‌లో మరో పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇప్పుడు బన్నీ లైనప్ వచ్చేసి.. సుకుమార్ (Sukumar), త్రివిక్రమ్ (Trivikram Srinivas), సందీప్ రెడ్డి వంగా దర్శకులతో సినిమాలను చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక మూడు సినిమాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్ ఏంటంటే.. ఒక్కో సినిమా ఒక్కో జోనర్‌లో ఉంటుందట. ఒక సినిమాతో మరో సినిమాకు ఎలాంటి కంపారిజన్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాడట బన్నీ. ఇక అంతకు ముందు బన్నీ కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్ లో ఒక సినిమా అనుకున్న విషయం తెలిసిందే. అది మాత్రం ఇప్పట్లో అయ్యేలా లేదు. ఎందుకంటే ఈ మూడు మూవీస్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం మూడేళ్లయినా పడుతుంది. ఈ సినిమాలు పూర్తైతే కానీ మరో సినిమా కమిట్ అయ్యే అవకాశం లేదు బన్నీ (Allu Arjun) కి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!