NTR – Ram Charan: కొత్త గొడవను వెదుక్కుని మరీ కొట్టుకుంటున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్..!

NTR, Ram Charan fans

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో.. దీనికి సంబంధించి వివాదాలు సైతం అంత పెద్ద ఎత్తున వచ్చాయి. తొలుత ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR)ను తక్కువ చేసి చూపించారంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గొడవ చేశారు. చాలా రోజుల పాటు ఈ గొడవ సాగుతూనే ఉంది. తరువాత కాస్త సద్దుమణిగింది. ఇక ఇప్పుడు రచ్చ చేయడం రామ్ చరణ్ ఫ్యాన్స్ (Ram Charan Fans) తమ వంతు అన్నట్టుగా స్టార్ట్ చేశారు. దీనికోసం ఒక కారణాన్ని కూడా వెతికి పట్టుకున్నారు. రచ్చ చేయడానికి ఆస్కార్ (Oscar) డిస్కషన్లను వేదికగా చేసుకున్నారు మెగా ఫ్యాన్స్ (Mega Fans).

ఎన్టీఆర్ (NTR) పర్ఫామెన్స్ ని కూడా ఆస్కార్‌కి కన్సిడర్ చేయాలి అని వచ్చిన ఒక వార్త వచ్చింది. ఆ వార్త రాజమౌళి (Rajamouli) తనయుడు కార్తికేయ (Karthikeya) వల్లనే వచ్చిందని మెగా ఫాన్స్ రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ (NTR) అంటే కార్తికేయకు వల్లమాలిన ప్రేమ అని అందుకే ఎన్టీఆర్ కోసం ఇలాంటి ఒక పెయిడ్ క్యాంపెయిన్ ని నడిపించాడని వారి ఆరోపణ. నిజానికి ఈ సినిమాతో చెర్రీకి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయని.. దానిని పాడు చేసి క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్‌ (Jr NTR)కు కట్టబెట్టేందుకు కార్తికేయ ఇలాంటి పెయిడ్ ప్రచారం మొదలు పెట్టాడంటూ మెగా ఫ్యాన్స్ (Mega Fans) రచ్చ చేస్తున్నారు.

NTR, Ram Charan

ఇక అటు మెగా.. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) ఇరువురూ క్రెడిట్ మొత్తం తమ అభిమాన హీరోకే కట్టబెట్టేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ల పాట్లేవో వీళ్లు పడేదానికి మధ్యలోకి కార్తికేయను లాగి రచ్చ చేయడమే కాస్త ఇబ్బందికరంగా మారింది. మేము మేము ఒకటేనంటూ పలు సందర్భాల్లో హీరోలు చెప్పినా కూడా ఫ్యాన్స్ వినరే. ఒకవైపు చిత్ర బృందం మాత్రం సినిమా భారీ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటే ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త గొడవను వెదుక్కుని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!