Manchu Lakshmi: 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న మంచు లక్ష్మికి ఇండిగో ఫ్లైట్‌లో చేదు అనుభవం..
ఇండిగో విమానయాన సంస్థ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన ప్రయాణికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటమే దీనికి కారణం. ఇప్పటికే ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati)తో పాటు పలువురు సెలబ్రిటీలు ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో బ్యాన్ ఇండిగో హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో కనిపించింది. ఇప్పుడు ప్రముఖ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) సైతం బ్యాన్ ఇండిగో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తోంది.
దీనికి కారణం.. ఆమె (Manchu Lakshmi) ఇండిగోలో చేదు అనుభవాన్ని ఎదుర్కోవడమే. విమానంలో తన బ్యాగు మరచిపోవడంతో దాని కోసం సిబ్బందిని ఎంతలా అడిగినా కూడా ఫలితం లేకుండా పోయిందట. 40 నిమిషాల పాటు 103 డిగ్రీల జ్వరంతో తాను ఎయిర్‌పోర్టులో ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలియజేస్తూ మంచు లక్ష్మి (Manchu Lakshmi) ట్విటర్ వేదికగా ఇండిగో విమానయాన (Indigo Airlines) సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా?’ అని మంచు లక్ష్మి (Manchu Lakshmi) ట్వీట్ చేసింది.
నిన్న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మంచు లక్ష్మి (Manchu Lakshmi).. ఫ్లైట్‌లో తన బ్యాగు మరిచిపోయింది. ఇండిగో (Indigo Airlines) సిబ్బందికి చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదని ట్విటర్ వేదిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తను మరచిపోయిన బ్యాగ్‌ని కలెక్ట్ చేసుకునేందుకు దాదాపు 40 నిమిషాల పాటు గేటు బయట వెయిట్ చేశానని తెలిపింది. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నానని వెల్లడించింది. మంచు లక్ష్మి ట్వీట్‌పై స్పందించిన ఇండిగో. ‘‘మా మేనేజర్ మీకు సహకరిస్తారు.. మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం.. తిరిగి మీరు మా ఫ్లైట్‌లో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది.