Poonam Kaur: టాలీవుడ్ ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు.. పూనమ్ కౌర్ కంటతడి..!

Poonam Kaur emotional

హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur).. సినిమాల్లో అప్పుడెప్పుడో మెరిసిన ఈ ముద్దుగుమ్మ  కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్‌ అయింది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. నటన కంటే అందంతోనే అమ్మడు మెస్మరైజ్ చేసింది. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాలపై దృష్టి సారించింది. ప్రత్యక్ష రాజకీయ మాటేమో కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం రాజకీయాలపై బీభత్సంగానే స్పందిస్తోంది. 

సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటుంది. మరి ఇలా స్పందిస్తుంటే నెటిజన్లు ఊరుకుంటారా? తరచూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ (Poonam Kaur) ఓ స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. తనను తెలంగాణ (Telangana) నుంచి వేరు చేస్తున్నారంటూ ఎమోషనల్‌ అయింది. అది మరేదో స్టేజ్ కాదు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోపూనమ్ కూడా పాల్గొంది. 

Actress Poonam Kaur

ఈ సందర్భంగా పూనమ్ (Poonam Kaur) మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన మతం కారణంగా తనను వేరు చేసి చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘నేను తెలంగాణ బిడ్డ అని నన్ను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు. ఇండస్ట్రీలో నాకు పని చేయాలని ఉంది. మీకు నచ్చిన బాంబే నుంచి వచ్చిన వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారు. తెలుగు బిడ్డ సావిత్రి అమ్మ అంటారు, ఇక్కడ పుట్టిన నాకు అవకాశాలు ఇవ్వట్లేదు. రాజకీయ కారణాలతో నన్ను తొక్కేస్తున్నారు’’ అని కన్నీళ్లు పెట్టుకుంది.

రాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..! Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా! Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..! Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ! Malavika Mohanan: ఇదేం అరాచకం.. మరీ ఈ రేంజ్‌లోనా మాళవికా..!