ప్రముఖ కమెడియన్ సుధాకర్(Comedian Sudhakar) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. ఆయన కామెడీ టైమింగ్‌తో పాటు స్పెషల్ డిక్షన్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సుధాకర్ ఇటీవల కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంన్నారు. ఆ మధ్య కాలంలో ఓ టీవీ ఛానల్లో ఓ కార్యక్రమంలో ఆయన తరచూ కనిపించారు.
అయితే అనారోగ్యానికి గురవడంతో టీవీ ఛానల్‌కి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఆయనను సోషల్ మీడియాలో జనాలు ఇప్పటి వరకూ ఎన్ని సార్లు చంపేశారో తెలియనిది కాదు. ప్రతిసారీ ఆయన తాను బతికే ఉన్నానంటూ చెప్పుకోవడం సర్వసాధారణమై పోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు. ఇలాంటి వార్తలు రావడం తనకు బాధగా అనిపించిందన్నారు. తానే మీడియా ముందుకు వచ్చి బతికే ఉన్నానని చెప్పుకోవడం దారుణమన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో తనకున్న సాన్నిహిత్యాన్ని సుధాకర్ ఫాదర్స్ డే సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో చిరంజీవి(Chiranjeevi)తో కలిసి ఒకే రూమ్‌లో ఉండేవారమని తెలిపారు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. చిరు(Chiranjeevi)ని, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ని అన్నయ్య అని పిలుస్తానని వెల్లడించారు. తనకు ఏ అవసరం వచ్చినా కూడా చిరునే అడుగుతానని.. ఆయన కాదనకుండా సాయం చేస్తారని తెలిపారు. ఆ కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సుధాకర్(Sudhakar) తెలిపారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…