Adipurush Tickets: 10 వేల మందికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టికెట్లు.. ప్రకటించిన నిర్మాత

ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌(Abhishek Agarwal) అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్(Adipurush) సినిమా టికెట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పది వేల మందికి పైగా ఉచితంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అభిషేక్ అగర్వాల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయ్.. ఇక్కడొక చిన్న మెలిక ఉంది.

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి మాత్రమే టికెట్లు ఉచితంగా అందివ్వనున్నారు. దీనికోసం ఒక గూగుల్ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆదిపురుష్ సినిమా టికెట్లు(Adipurush Movie Tickets) కావాలనుకునే వారు.. ఈ https://bit.ly/CelebratingAdipurush… గూగుల్‌ ఫామ్‌ని పూర్తి చేయాలని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ ఫామ్‌లో వివరాలు నమోదు చేస్తే తాము టికెట్లు పంపిస్తామని తెలిపారు. 

Advertisement

ఇక దీనికి సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ 95050 34567 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘ఈ జూన్‌లో అత్యంత గొప్ప వ్యక్తి మర్యాద పురుషోత్తముడు అయిన రాముని స్మరించుకుందాం. ఆదిపురుష్(Adipurush) వేడుకలు చేసుకుందాం. శ్రీరాముడి ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈతరం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన దివ్య అడుగుజాడలను అనుసరించాలి’’ అని అభిషేక్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Sootiga Team

Recent Posts

నవదీప్ పై పంఖురి గిద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ వెండితెరపై కనిపించక చాలా కాలం అవుతోంది. త్వరలోనే లవ్ మౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు…

May 3, 2024

ఆ బాధల నుంచి గట్టెక్కించే వీరుడిగా వీరమల్లు.. టీజర్ ఏం చెబుతోందంటే..

ఊరించి ఊరించి ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో పవన్‌ను అయితే…

May 3, 2024

‘పుష్ప 2’లో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి ఇంట్రస్టింగ్ టాక్..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ పుష్ప 2. తొలి పార్ట్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

May 3, 2024

చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే వలంటీర్ వచ్చి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు వలంటీర్ రావడం లేదు.…

May 2, 2024

విడాకుల వార్తలపై భర్తతో కలిసి క్లారిటీ ఇచ్చిన నటి ఇంద్రజ

సోషల్ మీడియా సామన్యులనైతే పట్టించుకోదు కానీ ప్రముఖులను అందునా సెలబ్రిటీలను వదిలేస్తుందా? చిన్న పాయింట్ దొరికితే చాలు నానా యాగీ…

May 1, 2024

ఐపీఎల్‌లో ప్రభాస్.. అందరి ఫోకస్ ఆయనపైనే.. కారణమేంటంటే..

నేషనల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD . ఈ…

May 1, 2024