Adipurush Tickets: 10 వేల మందికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టికెట్లు.. ప్రకటించిన నిర్మాత

Adipurush Tickets: 10 వేల మందికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టికెట్లు.. ప్రకటించిన నిర్మాత

ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌(Abhishek Agarwal) అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్(Adipurush) సినిమా టికెట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పది వేల మందికి పైగా ఉచితంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అభిషేక్ అగర్వాల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయ్.. ఇక్కడొక చిన్న మెలిక ఉంది.

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి మాత్రమే టికెట్లు ఉచితంగా అందివ్వనున్నారు. దీనికోసం ఒక గూగుల్ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆదిపురుష్ సినిమా టికెట్లు(Adipurush Movie Tickets) కావాలనుకునే వారు.. ఈhttps://bit.ly/CelebratingAdipurush… గూగుల్‌ ఫామ్‌ని పూర్తి చేయాలని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ ఫామ్‌లో వివరాలు నమోదు చేస్తే తాము టికెట్లు పంపిస్తామని తెలిపారు.

Adipurush Tickets: 10 వేల మందికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టికెట్లు.. ప్రకటించిన నిర్మాత

ఇక దీనికి సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ 95050 34567 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘ఈ జూన్‌లో అత్యంత గొప్ప వ్యక్తి మర్యాద పురుషోత్తముడు అయిన రాముని స్మరించుకుందాం. ఆదిపురుష్(Adipurush) వేడుకలు చేసుకుందాం. శ్రీరాముడి ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈతరం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన దివ్య అడుగుజాడలను అనుసరించాలి’’ అని అభిషేక్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.

Google News