Bhagavanth Kesari: బాలయ్య టైటిల్ వచ్చేసింది..‘ అన్న దిగిండు.. ఇగ మాస్‌ ఊచకోత షురూ’..

Bhagavanth Kesari: బాలయ్య టైటిల్ వచ్చేసింది..‘ అన్న దిగిండు.. ఇగ మాస్‌ ఊచకోత షురూ’..

నందమూరి బాలకృష్ణ(Balakrishna), అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకుక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ (Kajal) హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో శ్రీలీల(Sreeleela) నటిస్తోంది. షైన్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి చిత్ర యూనిట్అదిరిపోయే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఇప్పటికే ఈ టైటిల్ జనాల నోళ్లలో నానుతున్నా కూడా ఇది ఫిక్స్ చేస్తారా? లేదా? అనేది సందేహంగా మారింది. కానీ అదే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

ఈ చిత్రానికి ‘భగవంత్‌ కేసరి’(Bhagavanth Kesari) అనే టైటిల్‌‌ను ఖరారు చేశారు. మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం చిత్ర బృందం టైటిల్‌ను ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌‌లో బాలయ్యను చూస్తుంటే.. ఇప్పటి వరకూ మనం చూసిన బాలయ్య ఈయనేనా? అని అనిపించక మానదు. కొత్త హెయిర్‌ స్టైల్‌, చేతిలో ఆయుధాన్ని భూమిలోకి దింపుతూ కనిపించారు. ఆ ఆయుధం సరికొత్తగా కనిపిస్తోంది. దాన్ని డిజైన్ చేసిన తీరు కూడా ఆసక్తికరమే.

Bhagavanth Kesari First Look

టైటిల్ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).. ‘గిప్పడి సంది ఖేల్‌ అలగ్‌’ అని పోస్ట్ పెట్టారు. ఇక షైన్‌ స్ర్కీన్‌ సంస్థ వచ్చేసి ‘అన్న దిగిండు.. ఇగ మాస్‌ ఊచకోత షురూ’ అని పోస్ట్ పెట్టింది. మొత్తానికి ఇప్పటికే టైటిల్ బాలయ్య అభిమానుల(Balakrishna Fans)కు తెగ నచ్చేయడంతో పాటు పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Google News