Sai Pallavi: బాలీవుడ్‌లో రూపొందనున్న మరో రామాయణం.. సీతమ్మగా సాయిపల్లవి.. !

Sai Pallavi: బాలీవుడ్‌లో రూపొందనున్న మరో రామాయణం.. సీతమ్మగా సాయిపల్లవి.. !

ఏంటో కానీ ప్రస్తుతం అంతా రామాయణంపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఓం రౌత్(Om Raut), ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో రామాయణంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా ‘ఆదిపురుష్’(Adipurush) రూపొందిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్‌లోనూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) రామాయణం(Ramayanam)ను తెరకెక్కించనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక తాజాగా బాలీవుడ్‌లోనే మరో రామాయణంను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. 

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా రామాయణం(Ramayanam) రూపొందబోతోందట. ఈ చిత్రంలో సీతమ్మ పాత్రలో సాయిపల్లవి(Sai Pallavi) నటించనుందని టాక్ నడుస్తోంది. అసలే అమ్మడు పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తుంది. ఇక సీతమ్మ పాత్ర అంటే జీవించేయడం ఖాయమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్దగా మేకప్ వేసుకోకుండా నటించే సాయి పల్లవి అయితేనే సీతమ్మ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Sai Pallavi as Seetha

విరాటపర్వం(Viarata Parvam), గార్గీ(Gargi) మూవీస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయిపల్లవి(Sai Pallavi) ప్రస్తుతం శివ కార్తికేయన్‌(Siva Karthikeyan)తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇది పూర్తైతే.. అది కూడా తనకు సీతమ్మ పాత్రలో నటించేందుకు అంగీకరమైతే రామాయణం మూవీ స్టార్ట్ అవుతుందని టాక్. అయితే ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, రావణుడి పాత్రలో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఎంపిక చేయనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!