Megha Akash: ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి..!

Megha Akash: ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి..!

సినిమాల్లో రాణించాలంటే అందం, అభినయమే కాదు.. కాస్తంత లక్ కూడా ఉండాలి. ఇక హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో రాణించే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు.. మేఘా ఆకాష్(Megha Akash). ఈ ముద్దుగుమ్మకి సక్సెస్ రేట్ అసలు లేదనే చెప్పాలి. నితిన్(Nithin) హీరోగా రూపొందిన లై మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మేఘా ఆకాష్.. తొలి సినిమాతోనే అట్టర్ ఫ్లాప్‌ను అందుకుంది.

ఇక ఆ తరువాత కూడా నితిన్‌(Nithin)తోనే ‘చల్ మోహనరంగ’(Chal Mohanaranga) మూవీ చేసి మరో అట్టర్ ఫ్లాప్‌ను అందుకుంది. అమ్మడికి హిట్స్ లేకున్నా కూడా అవకాశాలకు మాత్రం కొదువ లేదు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ అమ్మడు 20కి పైగా సినిమాల్లో నటిచింది. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందట. ప్రేమించిన వ్యక్తినే ఈ ముద్దుగుమ్మ పెళ్లాడబోతోందని సమాచారం.

Megha Akash: ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి..!

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఈ ముద్దుగుమ్మ ఏకంగా  తమిళనాడుకి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో ప్రేమలో పడిందని టాక్. గత కొంతకాలంగా నడుస్తున్న వీరి ప్రేమ వ్యవహారం త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోందట. అమ్మడికి కాబోయే వ్యక్తి వేల కోట్ల రూపాయలకు అధిపతి అని సమాచారం. ఈ ముద్దుగుమ్మకి లక్ మామూలుగా లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అమ్మడికి కెరీర్ పరంగా కూడా అద్భుతంగానే ఉంది.

Google News