పుష్ప-2లో శ్రీవల్లి లుక్ చూశారా.. అదిరిపోలా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప: ది రూల్‌’. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పుష్ప పార్ట్ 2కి సంబంధించి రష్మిక లుక్‌కి సంబంధించిన పోస్టర్ అది. 

ఇక మొదటి భాగంలో రష్మిక చాలా  నిరుపేద కుటుంబానికి చెందిన యువతిగా చూపించారు కాబట్టి చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ పార్ట్ 2లో స్మగ్లింగ్ వ్యాపారంలో ఓ రేంజ్‌లో సంపాదించిన పుష్పరాజ్ భార్య కాబట్టి ఒంటి నిండా నగలతో మెరిసిపోతోంది. పార్ట్ 1లో చూసిన రష్మికకు.. పార్ట్ 2లో రష్మికకు చాలా తేడా ఉంది. పార్ట్ 1లో డిగ్లామరస్ రోల్‌లో కనిపించిన రష్మిక.. ఈ పోస్టర్‌లో గ్రీన్ కలర్ శారీతో.. ఫేర్ కలర్‌తో రష్మిక మెరిసిపోతోంది. 

Advertisement

ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శ్రీవల్లీ పోస్టర్‌ను చూసి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. పార్ట్‌-1 సమయంలో విడుదల చేసిన లుక్‌తో పార్ట్ 2 పోస్టర్‌ను కంపేర్ చేసి మరీ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి భాగంలో పుష్పరాజ్, శ్రీవల్లిల లవ్.. పెళ్లి వరకూ చూపించారు. ఇక పార్ట్ 2లో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండనుందని సమాచారం. ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Sootiga Team

Recent Posts

ఎన్టీఆర్ లైఫ్‌లో ఎప్పటికీ ఆ లోటు ఉంటుందట.. అదేంటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో…

May 21, 2024

రేవ్ పార్టీలో లేను.. ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నా: నటి హేమ

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…

May 20, 2024

కుప్పంలో చంద్రబాబు ఓటమి కన్ఫర్మ్: పెద్దిరెడ్డి

ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…

May 20, 2024

కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు.. పిక్స్ వైరల్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…

May 20, 2024

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…

May 19, 2024

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్‌లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…

May 19, 2024