పుష్ప-2లో శ్రీవల్లి లుక్ చూశారా.. అదిరిపోలా..!

పుష్ప-2లో శ్రీవల్లి లుక్ చూశారా.. అదిరిపోలా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప: ది రూల్‌’. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ రష్మిక పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పుష్ప పార్ట్ 2కి సంబంధించి రష్మిక లుక్‌కి సంబంధించిన పోస్టర్ అది. 

ఇక మొదటి భాగంలో రష్మిక చాలా నిరుపేద కుటుంబానికి చెందిన యువతిగా చూపించారు కాబట్టి చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ పార్ట్ 2లో స్మగ్లింగ్ వ్యాపారంలో ఓ రేంజ్‌లో సంపాదించిన పుష్పరాజ్ భార్య కాబట్టి ఒంటి నిండా నగలతో మెరిసిపోతోంది. పార్ట్ 1లో చూసిన రష్మికకు.. పార్ట్ 2లో రష్మికకు చాలా తేడా ఉంది. పార్ట్ 1లో డిగ్లామరస్ రోల్‌లో కనిపించిన రష్మిక.. ఈ పోస్టర్‌లో గ్రీన్ కలర్ శారీతో.. ఫేర్ కలర్‌తో రష్మిక మెరిసిపోతోంది.

పుష్ప-2లో శ్రీవల్లి లుక్ చూశారా.. అదిరిపోలా..!

ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శ్రీవల్లీ పోస్టర్‌ను చూసి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. పార్ట్‌-1 సమయంలో విడుదల చేసిన లుక్‌తో పార్ట్ 2 పోస్టర్‌ను కంపేర్ చేసి మరీ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి భాగంలో పుష్పరాజ్, శ్రీవల్లిల లవ్.. పెళ్లి వరకూ చూపించారు. ఇక పార్ట్ 2లో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండనుందని సమాచారం. ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.