రష్మికను వదిలెయ్ అంటూ విజయ్‌కు అభిమాని రిక్వెస్ట్..

రష్మికను వదిలెయ్ అంటూ విజయ్‌కు అభిమాని రిక్వెస్ట్.. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరిలో ఎవరూ కూడా ఏ విధంగానూ స్పందించింది లేదు. పలుమార్లు వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ బయటకు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఉన్న పిక్స్ బయటకు రాకున్నా కూడా సోషల్ మీడియాలో వీరిద్దరూ విడివిడిగా పోస్ట్ చేసిన పిక్స్ అన్నింటి బ్యాక్‌గ్రౌండ్ సేమ్ ఉండటంతో నెటిజన్లు పట్టేశారు.

ఇక వీరిద్దరూ ఎయిర్‌పోర్టులోనూ చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. మొత్తానికి వారిద్దరూ ఒప్పుకోకున్నా రిలేషన్‌లో ఉన్నారని మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇటీవలి కాలంలో అంటే గీత గోవిందం మూవీ తర్వాత విజయ్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అనేదే లేదు. ఖుషి సినిమా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీపై విజయ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ సినిమాకు ఆశించిన స్థాయి టాక్ అయితే వినిపించడం లేదు.

సినిమా చూసిన విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు.. ఒకింత ఫైర్ అయ్యాడు. వెంటనే రష్మికను వదిలెయ్యాలని.. అప్పుడే నువ్వు బాగుపడతావంటూ హితవు పలికాడు. “కొండన్న.. ఈ సినిమా బాగాలేదు. నువ్వు ముందు రష్మికను వదిలేయ్.. నీ కెరియర్ మీద దృష్టి పెట్టు. అప్పుడే బాగుపడతావు. ఫ్యామిలీ స్టార్ సినిమా బాగోలేదు. కథ, కథనం, మాటలు, సంగీతం, దర్శకత్వం వంటివి బాగోలేవు. సినిమా అంత ఆసక్తికరంగా లేదు’’ అని తెలిపాడు. ఇక విజయ్ ఈ పోస్ట్‌పై స్పందిస్తాడో లేదో చూడాలి.

Google News