టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌కి ఎన్టీఆర్..

టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌కి ఎన్టీఆర్..

డీజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ నెల 8న జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నాడు. నిజానికి దీనికి సంబంధించి రెండు రోజుల క్రితమే టాక్ వచ్చింది. అదెలాగంటే.. ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం టిల్లు స్క్వేర్ సినిమా చూశాడట. 

సినిమ హిట్ అవడంతో తన ఇంటికి సిద్దు జొన్నలగడ్డతో పాటు నిర్మాత నాగవంశీ, మరో యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ని పిలిచి పార్టీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన పిక్స్ బయటకు రావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి సక్సెస్ మీట్‌కి ఎన్టీఆరే ముఖ్య అతిథి అంటూ టాక్ మొదలైంది. అదే నిజమైంది. టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. 

తొలి మూడు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ మూవీ కలెక్షన్లు రూ.50 కోట్లకు చేరుకుంది. తొలి వారంలో దాదాపు రూ.100 కోట్ల మార్కును అందుకుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ సక్సెస్ మీట్‌ని ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి సక్సెస్ మీట్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధుకి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. వీళ్లిద్దరి జంట వెండితెరను షేక్ చేసింది.

Google News