నాని అనే నేను బిజీ.. బిజీ..!!

నాని అనే నేను బిజీ.. బిజీ..!!

నేచురల్ స్టార్ నానికి జెర్సీ మూవీ తర్వాత ఎందుకోగానీ పెద్దగా హిట్స్ అయితే లేవు. అన్నీ ఓ మోస్తరు సినిమాలే. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దరి చేరడం లేదు. ఇటీవల ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు కానీ అంతగా అయితే ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పైనే నాని ఆశలన్నీ పెట్టుకున్నాడు.

ఇక నాని గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. నాని తన నెక్ట్స్ సినిమా జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌తో చేయనున్నాడట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథను నాని వినేశాడట. కథ నచ్చడంతో ఓకే కూడా చెప్పేశాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. కాగా.. నాని ఇప్పటికే సుజీత్, శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు ప్రకటించేశాడు. అలాగే బలగం వేణుతో సైతం ఓ సినిమా చెస్తానని చెప్పాడు.

మరి ఇన్ని సినిమాలు ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటాయి? జ్ఞానవేల్‌తో సినిమా ఎప్పుడు చేస్తాడు? ఈ వార్తపై కాస్త గందరగోళమే నెలకొంది. అయితే నాని చాలా కాలంగా తన రెమ్యూనరేషన్ రూ.25 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. అయితే ‘హాయ్ నాన్న’ చిత్రానికి రెమ్యూనరేషన్‌కు బదులు కొన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నాడట. ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే.. తాజాగా ఓ నిర్మాత నానికి రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అయితే ఇది రెండు సినిమాలకని కొందరు.. కాదు ఒక్క సినిమాకే అని కొందరు అంటున్నారు. నిజమేంటనేది తెలియాల్సి ఉంది.

Google News