విశ్వంభర నుంచి అదిరిపోయే అప్‌డేట్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ విశ్వంభర’. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే ఒక భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది. 

యాక్షన్ సీన్స్‌ అన్నీ రామ్‌ – లక్ష్మణ్‌ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.  అదే ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎవరిది? ‘విశ్వంభర’లో విలన్‌ పాత్రలో నటించే నటుడి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంతకీ విశ్వంభర విలన్ ఎవరంటారా? బాలీవుడ్‌ నటుడు కునాల్ కపూర్. ఆయన పేరును అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. గతంలో నాగార్జున,నాని నటించిన దేవదాస్‌ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కునాల్ కనిపించాడు. 

దేవదాస్ తర్వాత మళ్లీ ఇదే ఆయన తెలుగు తెరపై కనిపించడం. మొత్తానికి మెగాస్టార్ సినిమాలో అది కూడా విలన్‌గా అవకాశం కొట్టేయడమంటే సామాన్య విషయం కాదు. తొలుత ఈ అవకాశం దగ్గుబాటి రాణాను వరించిందట. అయితే ఈ పాత్ర ప్రస్తుతం రానా నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన పాత్రకు దగ్గరగా ఉండటంతో నో చెప్పాడట.  దీంతో కునాల్‌ను ఈ అవకాశం వరించింది. ఇక విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Sootiga Team

Recent Posts

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024

హమ్మయ్యా.. ప్రభాస్ కల్కి సినిమా సేఫ్..!

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినీ జీవితంలో తొలిసారి ఇలా జరుగుతోంది.…

June 26, 2024

నా కడుపుకి ప్రభాసే కారణం.. షాకిచ్చిన దీపిక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాఘ్ అశ్విన్ దర్శకత్వంలో…

June 22, 2024

కల్కి తొలి రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ . నాగ్ అశ్విన్…

June 22, 2024

అనుష్కకు అరుదైన సమస్య.. చాలా ఇబ్బంది పడుతోందట..

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క ఒకరు. టాలీవుడ్‌లో అయితే ఓ వెలుగు వెలిగింది. డైనమిక్…

June 20, 2024