విశ్వంభర నుంచి అదిరిపోయే అప్‌డేట్..

విశ్వంభర నుంచి అదిరిపోయే అప్‌డేట్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ విశ్వంభర’. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే ఒక భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది. 

యాక్షన్ సీన్స్‌ అన్నీ రామ్‌ – లక్ష్మణ్‌ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎవరిది? ‘విశ్వంభర’లో విలన్‌ పాత్రలో నటించే నటుడి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంతకీ విశ్వంభర విలన్ ఎవరంటారా? బాలీవుడ్‌ నటుడు కునాల్ కపూర్. ఆయన పేరును అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. గతంలో నాగార్జున,నాని నటించిన దేవదాస్‌ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కునాల్ కనిపించాడు.

Kunal Kapoor in Viswambhara

దేవదాస్ తర్వాత మళ్లీ ఇదే ఆయన తెలుగు తెరపై కనిపించడం. మొత్తానికి మెగాస్టార్ సినిమాలో అది కూడా విలన్‌గా అవకాశం కొట్టేయడమంటే సామాన్య విషయం కాదు. తొలుత ఈ అవకాశం దగ్గుబాటి రాణాను వరించిందట. అయితే ఈ పాత్ర ప్రస్తుతం రానా నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన పాత్రకు దగ్గరగా ఉండటంతో నో చెప్పాడట.  దీంతో కునాల్‌ను ఈ అవకాశం వరించింది. ఇక విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.