బన్నీ అన్ ఫాలో చేసిన మెగా హీరో… నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

బన్నీ అన్ ఫాలో చేసిన మెగా హీరో… నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎన్నికల సమంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం ఓ ట్వీట్ చేసి ఆసక్తిని రేకెత్తించాడు. పవన్‌కు మద్దతు తెలిపిన బన్నీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే తెల్లవారే పాటికే వైసీపీ నేత తరుఫున ప్రచారంలో పాల్గొని షాక్ ఇచ్చారు. బన్నీ చేసింది.. తప్పా? ఒప్పా? అనే విషయాన్ని పక్కనబెడితే ఇది ఇరు కుటుంబాల మధ్య దూరం పెంచిందని టాక్.

బన్నీ చేసిన ఒకే ఒక్క పనితో మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసి ఎక్కడా కనిపించలేదు. పవన్ భారీ విక్టరీ తర్వాత మెగా ఫ్యామిలీలో పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. వాటిల్లో ఎక్కడా కూడా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అక్కడ కూడా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా పవన్‌కు శుభాకాంక్షలు తెలపలేదు. దీంతో చెప్పకుండానే ఆ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగిందని అర్థమవుతోంది.

ఇక తాజాగా మేనమామలను అమితంగా ఇష్టపడే సాయి ధరమ్.. బన్నీతో పాటు స్నేహారెడ్డిలను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై మెగా డాటర్ నిహారిక స్పందించింది. నిహారిక తన సొంత సంస్థ ఎలిఫెంట్ పిక్సర్చ్స్ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు సినిమా నిర్మిస్తోంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమెకు ఈ అన్‌ఫాలోకు సంబంధించిన ప్రశ్న ఎదురవగా.. ఆ విషయం తనకు తెలియదని.. ఎవరి కారణాలు వారికి కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.