ఓజీ రానట్టేనా…? మరి ఆ సెట్‌లో పవన్ ఎప్పుడు అడుగు పెడతారు?

ఓజీ రానట్టేనా...? మరి ఆ సెట్‌లో పవన్ ఎప్పుడు అడుగు పెడతారు?

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఆ సినిమా ఈ ఏడాది అయితే రిలీజ్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఆ డేట్‌కు సినిమా వచ్చేది కష్టమంటూ ఫీలర్లు కూడా వచ్చాయి. పవన్ డిప్యూటీ సీఎం అవగానే సీన్ మారిపోయింది. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.

ఓజీ సినిమా ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నా.. ప్రస్తుతం పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో మిగిలి ఉన్న చిత్రీకరణను పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా.. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్‌ రైట్ల ఒప్పందాలు పూర్తిగా కొలిక్కి రానట్లు తెలుస్తోంది. దీంతో ఇది ఈ ఏడాది విడుదలవడం కష్టమేనని తెలుస్తోంది.

ఓజీ రానట్టేనా...? మరి ఆ సెట్‌లో పవన్ ఎప్పుడు అడుగు పెడతారు?

మరోవైపు ‘హరి హర వీరమల్లు’ బృందం మాత్రం తమ చిత్రాన్ని ఈ ఏడాదే బాక్సాఫీస్‌ బరిలో దింపాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే సన్నాహాలు కూడా చేసుకుంటోంది. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తొలి భాగం కోసం పవన్‌ మరో 20రోజులు షూట్‌లో పాల్గొనాల్సి ఉంది. కేవలం 20 రోజులు కేటాయిస్తే ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుని ఈ ఏడాది చివరి నాటికి విడుదలై పోతుంది. మరి పవన్ సెట్‌లో తిరిగి ఎప్పుడు అడుగు పెడతారో చూడాలి.