విడాకులకు అప్లై చేసిన సూపర్ స్టార్ కొడుకు, కోడలు.. ఇవేం ఆరోపణలు బాబోయ్..

కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి బైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరూ ఇప్పటికే విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. తనను తన భార్య క్రూరంగా హింసిస్తోందని యువరాజ్.. లేదు తన భర్తే తనను హింసిస్తున్నాడంటూ శ్రీదేవి నానా రచ్చ చేస్తున్నారు. భార్య శ్రీదేవి భైరప్పపై లీగల్ నోటీసులో యువరాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ నోటీసులపై స్పందించిన యువరాజ్ సైతం సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించిందని.. ఇంటి పేరు దుర్వినియోగం చేసిందని యువరాజ్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన అక్రమ సంబంధాన్ని కప్పి పుచ్చుకునేందుకు నటితో యువరాజ్‌కు అక్రమ సంబంధం అంట గడుతోందన్నారు.

యువరాజ్‌కు లైంగిక సమస్య ఉందని తనకు ఇచ్చిన నోటిసులో శ్రీదేవి పేర్కొందని.. అలాంటప్పుడు అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుందని ఆయన లాయర్ ప్రశ్నించారు.

గత కొన్ని నెలలుగా యువరాజ్‌తో తాను చాలా బాధలు పడ్డానని.. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నానని శ్రీదేవి భైరప్ప వెల్లడించారు. ఒక వ్యక్తి ఇలా బహిరంగంగా ఒక మహిళను చులకనగా మాట్లాడటం.. తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. తన మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నానని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాశారు. యువరాజ్, శ్రీదేవిలది ప్రేమ వివాహం కావడం గమనార్హం. వీరికి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పునీత్ రాజ్‌కుమార్ జోక్యం చేసుకుని వివాహం జరిపించారు.

Sootiga Team

Recent Posts

మరో జన్మ ఉంటే.. మళ్ళీ పుట్టు రాజన్న..!

ఎటు చూసినా.. ఎవరి నోట విన్నా వైఎస్! పేదల పెన్నిధి, 108, 104, ఆరోగ్యశ్రీ సృష్టికర్త.. రైతు బాంధావుడు, సంక్షేమ…

July 8, 2024

వెంకీ.. ఈసారి సోలోగానే

అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అయ్యారు వెంకటేశ్. ఈ కాంబినేషన్ లో సినిమా లాంఛింగ్ కూడా ఇటీవల…

July 8, 2024

నాన్నా.. మీ ఆశయాల సాధనే లక్ష్యం!

వైఎస్సార్.. యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధత్యలు స్వీకరించి..…

July 8, 2024

రాజ్ తరుణ్ రాజీకి ట్రై చేశాడా?

హీరో రాజ్ తరుణ్, అతడి ప్రేయసి లావణ్య మధ్య నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడిందులో కొత్త కోణం…

July 8, 2024

వైఎస్.. చరిత్ర మరిచిపోలేని పేరు!

వైఎస్ఆర్.. వైఎస్.. యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి ఆ పేరే ఒక ప్రభంజనం..! చరిత్ర మరిచిపోలేని పేరు! జనం గుండెల్లో…

July 7, 2024

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024