విడాకులకు అప్లై చేసిన సూపర్ స్టార్ కొడుకు, కోడలు.. ఇవేం ఆరోపణలు బాబోయ్..

విడాకులకు అప్లై చేసిన సూపర్ స్టార్ కొడుకు, కోడలు.. ఇవేం ఆరోపణలు బాబోయ్..

కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి బైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరూ ఇప్పటికే విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. తనను తన భార్య క్రూరంగా హింసిస్తోందని యువరాజ్.. లేదు తన భర్తే తనను హింసిస్తున్నాడంటూ శ్రీదేవి నానా రచ్చ చేస్తున్నారు. భార్య శ్రీదేవి భైరప్పపై లీగల్ నోటీసులో యువరాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ నోటీసులపై స్పందించిన యువరాజ్ సైతం సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించిందని.. ఇంటి పేరు దుర్వినియోగం చేసిందని యువరాజ్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన అక్రమ సంబంధాన్ని కప్పి పుచ్చుకునేందుకు నటితో యువరాజ్‌కు అక్రమ సంబంధం అంట గడుతోందన్నారు.

యువరాజ్‌కు లైంగిక సమస్య ఉందని తనకు ఇచ్చిన నోటిసులో శ్రీదేవి పేర్కొందని.. అలాంటప్పుడు అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుందని ఆయన లాయర్ ప్రశ్నించారు.

గత కొన్ని నెలలుగా యువరాజ్‌తో తాను చాలా బాధలు పడ్డానని.. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నానని శ్రీదేవి భైరప్ప వెల్లడించారు. ఒక వ్యక్తి ఇలా బహిరంగంగా ఒక మహిళను చులకనగా మాట్లాడటం.. తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. తన మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నానని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాశారు. యువరాజ్, శ్రీదేవిలది ప్రేమ వివాహం కావడం గమనార్హం. వీరికి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పునీత్ రాజ్‌కుమార్ జోక్యం చేసుకుని వివాహం జరిపించారు.