మెగా అభిమానులకు మైండ్‌లో ఫిక్స్ అయిన ఆ దృశ్యమేంటో తెలుసా?

మెగా అభిమానులకు మైండ్‌లో ఫిక్స్ అయిన ఆ దృశ్యమేంటో తెలుసా?

కొన్ని దృశ్యాలు అరుదుగానే చూడగలం. ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి నెట్టింట వైరల్ అవుతూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇలాంటి రోజు ఒకటొస్తుందని.. ఇలాంటి సీన్ చూస్తామని కూడా అనుకోం. అలాంటి ఘటనే నేడు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో చోటు చేసుకుంది. ఈ దృశ్యం మెగా అభిమానులకైతే మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ఆ దృశ్యం ఏంటంటారా?

మెగా అభిమానులకు మైండ్‌లో ఫిక్స్ అయిన ఆ దృశ్యమేంటో తెలుసా?

ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఇది సర్వసాధారణమే కానీ మోదీ వేదికపై నుంచి దిగిపోయే క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయి పట్టుకుని చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఒకవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కల్యాణ్.. మధ్యలో మోదీ నిలుచొని ముగ్గురూ చేతులు ఎత్తి అభివాదం చేశారు. ఈ దృశ్యం మెగా అభిమానులకైతే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

అక్కడున్న అభిమానులే కాకుండా మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ అయితే అరుపు, కేకలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక పవన్ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా అందరినీ వెళ్లి పలకరించారు. ఆ తరువాత చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. ఆ దృశ్యం కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎంత డిప్యూటీ సీఎం అయినా ఓ అన్నకు తమ్ముడే కదా.

Google News