అమెరికాలో దిల్ రాజు జంట.. కపుల్ గోల్స్ అంటున్న నెటిజన్లు

అమెరికాలో దిల్ రాజు జంట.. కపుల్ గోల్స్ అంటున్న నెటిజన్లు

డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన దిల్ రాజు టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదగడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వాస్తవానికి ఇవన్నీ జనాలకు తెలిసిన విషయాలే. ఇక దిల్ రాజు పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. దానిలోనూ దాపరికాలేమీ లేవు. కొన్నేళ్ల క్రితం ఆయన మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో రెండో వివాహం చేసుకున్నారు. 

ఆయన రెండో వివాహం చేసుకున్న తేజస్విని మరెవరో కాదు ఆయన దూరపు బంధువే. కరోనా లాక్‌డౌన్ సమయంలో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు. ఇటీవలే భార్య తేజస్విని, కుమారుడు అన్విరెడ్డితో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్‌లో దిల్ రాజు పాల్గొన్నారు. ఇక తాజాగా భార్యతో కలిసి వెకేషన్ కోసం అమెరికాకు చెక్కేశాడు. అక్కడ దిల్ రాజు ఎంజాయ్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉంది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

కొడుకుతో కలిసి దిల్ రాజు జంట అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దిల్ రాజు, తేజస్విని కపుల్ ఫోటో షూట్ అయితే నెటిజన్లను మరింత ఆకట్టుకుంటోంది. జీన్స్ షర్ట్ అండ్ షార్ట్‌లో దిల్ రాజు, వైట్ కలర్ లాంగ్ డ్రెస్‌లో తేజస్విని కనువిందు చేస్తున్నారు. రకరకాల ఫోజులతో వీరు తీసుకున్న పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. పిక్స్ అదుర్స్ అని.. కపుల్ గోల్స్ అని.. ఇద్దరూ కలిసి సినిమా చేయవచ్చు కదా అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Google News