బోయపాటి.. మరి ఈ చిత్రం ఆ సీక్వెలేనా?

బోయపాటి.. మరి ఈ చిత్రం ఆ సీక్వెలేనా?

ఇండస్ట్రీలోనే ది బెస్ట్ కాంబో అంటే.. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్‌ల కాంబో. వీళ్లిద్దరి సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్‌కు పండుగే. ముఖ్యంగా వీరిద్దరి కాంబో మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు నాలుగోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. బాలకృష్ణ పుట్టిన రనోజు సందర్భంగా బోయపాటితో సినిమాను అధికారికంగా ప్రకటించారు.

#BB4 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2021లో బోయపాటి, బాలయ్య కాంబోలో అఖండ మూవీ వచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే బోయపాటి ప్రకటించారు.

బోయపాటి.. మరి ఈ చిత్రం ఆ సీక్వెలేనా?

మరి ఇప్పుడు #BB4 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’నా లేదంటే కొత్త సినిమానా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అఖండ సీక్వెల్ గురించి బోయపాటి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఎన్నికల హడావిడి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుందని వెల్లడించారు. ఆ చిత్రంలో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లను చూపించామని.. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుందన్నారు. మరి ఎన్నికల అయిపోయిన తర్వాత వచ్చిన ఈ ప్రకటన ఆ సీక్వెల్‌కు సంబంధించిందేనా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.

Google News