షాకింగ్.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తాప్సీ

సొట్ట బుగ్గల సుందరి తాప్సి గురించి చెప్పా్ల్సిన పని లేదు. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా స్టార్ స్టేటస్‌ను అయితే సొంతం చేసుకోలేకపోయింది. కానీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని అయితే సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు ఇటీవలి కాలంలో తరుచుగా వినవస్తూనే ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకూ త్వరలోనే పెళ్లంటూ వార్తలు వినవచ్చేవి. తాజాగా తాప్సీకి పెళ్లైపోయిందనే వార్తలు వినవస్తున్నాయి.

డెన్మార్క్‌ బ్యాడ్మింటన్  ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ రిలేషన్ షిప్‌లో ఉందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికీ పెళ్లైపోయిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ తాప్సీ ఆ వార్తలన్నింటినీ ఖండించింది. అవి ఫేక్ వార్తలుగా పేర్కొంది. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది.

Advertisement

అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్‌ చెబుతోంది. అంత సీక్రెట్‌గా తాప్సి వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం తెలియరాలేదు. తాప్సి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్‌. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే.. కొందరు బాలీవుడ్‌ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్‌ మీడియాలో తెలిపారు. ఇక అంతే.. వారంతా వెళ్లింది తాప్సీ పెళ్లికేనని బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది.

Advertisement
Sootiga Team

Recent Posts

ప్రమాదానికి గురైన జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…

May 19, 2024

కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో అదిరిపోయే ఛాన్స్ పట్టేసిన పూజా హెగ్డే..

తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్‌లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…

May 19, 2024

మహేష్ – రాజమౌళి కాంబో గురించి వస్తున్న వార్తలు ఫేక్ అట..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…

May 19, 2024

ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ రాబోతోంది..

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ చిత్రం దేవర. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఊర మాస్…

May 18, 2024

బుల్లితెరపై విషాదం.. ఇద్దరు ఫేమస్ నటుల మృతి.. ప్రియురాలు చనిపోయిందని..

బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…

May 18, 2024

మొన్న ఔట్.. నేడు ఇన్.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది?

మెగా బ్రదర్‌ నాగబాబుకు ఆవేశం ఎక్కువ. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తేవడంలో ఆయన దిట్ట. ఈ ఆవేశంతోనే…

May 18, 2024