షాకింగ్.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తాప్సీ

షాకింగ్.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తాప్సీ

సొట్ట బుగ్గల సుందరి తాప్సి గురించి చెప్పా్ల్సిన పని లేదు. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా స్టార్ స్టేటస్‌ను అయితే సొంతం చేసుకోలేకపోయింది. కానీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని అయితే సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు ఇటీవలి కాలంలో తరుచుగా వినవస్తూనే ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకూ త్వరలోనే పెళ్లంటూ వార్తలు వినవచ్చేవి. తాజాగా తాప్సీకి పెళ్లైపోయిందనే వార్తలు వినవస్తున్నాయి.

డెన్మార్క్‌ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ రిలేషన్ షిప్‌లో ఉందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికీ పెళ్లైపోయిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ తాప్సీ ఆ వార్తలన్నింటినీ ఖండించింది. అవి ఫేక్ వార్తలుగా పేర్కొంది. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది.

షాకింగ్.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తాప్సీ

అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్‌ చెబుతోంది. అంత సీక్రెట్‌గా తాప్సి వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం తెలియరాలేదు. తాప్సి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్‌. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే.. కొందరు బాలీవుడ్‌ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్‌ మీడియాలో తెలిపారు. ఇక అంతే.. వారంతా వెళ్లింది తాప్సీ పెళ్లికేనని బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది.

Google News