బిగ్‌బాస్ బ్యూటీకి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ..

బిగ్‌బాస్ బ్యూటీకి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ..

కన్నడ నటి, బిగ్‌ బాస్‌ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడ బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో అరెస్ట్ అయ్యింది. ఆమెకు ఏప్రిల్ 8 వరకూ అంటే 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. అసలేం జరిగిందంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ ఇటీవల ఓ 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకుంది. ఎవరినైనా దత్తత తీసుకోవాలంటే కొన్ని విధివిధానాలు ఉంటాయి. వాటిని సోను అధిగమించింది.

మార్చి 2న 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్నట్టు సోను గౌడ సోషల్ మీడియాలో వెల్లడించింది. బాలిక తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ దత్తత వ్యవహారమంతా జరిగింది. అయితే హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. కానీ ఈ గ్యాప్ వారిద్దరి మధ్య లేదు. అలాగే కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి దత్తత విషయాన్ని తెలిపి వారి సమక్షంలోనే దత్తత తీసుకోవాలి. సోనూ గౌడ ఇవేమీ చేయలేదు.

Advertisement
బిగ్‌బాస్ బ్యూటీకి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ..

పాప కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా ఆమె రక్షణ కోసం తాను తీసుకొచ్చుకున్నట్టు సోను గౌడ వెల్లడించింది. అయితే పాపను దత్తత తీసుకునే సమయంలో సోను గౌడ ఆమె తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలను కల్పించింది. ఈ వ్యవహారమంతా అమ్మకాల ప్రక్రియ మాదిరిగా ఉందని పోలీసులు భావించారు. అంతేకాకుండా ఈ వ్యవహారం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని పోలీసులు చెబుతున్నారు. స్కూలు కెళ్లి చదువుకోవాల్సిన వయసులో పాప స్కూలుకు వెళ్లడం లేదు. దీంతో సోనూగౌడను పోలీసులు అరెస్ట్ చేసి చిన్నారిని కస్టడీలోకి తీసుకుని ప్రస్తుతానికి  ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు.