శివాజీకి బాగా నచ్చిన గిఫ్ట్ ఇచ్చి ఫిదా చేసిన పల్లవి ప్రశాంత్..

శివాజీకి బాగా నచ్చిన గిఫ్ట్ ఇచ్చి ఫిదా చేసిన పల్లవి ప్రశాంత్..

బిగ్‌బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీజన్ ఇంత సక్సెస్ అవడానికి కారణం.. నటుడు శివాజీ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్, మోడల్ ప్రిన్స్ యావర్. ఈ ముగ్గురూ స్పై గ్రూప్‌గా ఫేమస్ అయ్యారు. హౌస్ లో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ గురు శిష్యులుగా మెలిగారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి బంధం అలాగే కొనసాగుతోంది. వీరికి బయట విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.

తాజాగా పల్లవి ప్రశాంత్ హౌస్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. ఓ పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను కూడా ఆహ్వానించాడు. దీనికి శివాజీ సందీప్ మాస్టర్, భోలే షావలి హాజరయ్యారు. శివాజీ చేతుల మీదుగానే రైతు కుటుంబానికి డబ్బులు అందించారు. ఈ క్రమంలోనే శివాజీకి కూడా ప్రశాంత్ అదిరిపోయే గిఫ్ట్ అందించాడు.

ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటారా? శివాజీకి బ్రూ కాఫీ పౌడర్‌ను ప్రశాంత్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో శివాజీ ఫుల్ ఖుషీ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా శివాజీ కాఫీ పౌడర్ కోసం నానా గొడవ చేసేవాడు. ఆయనకు కాఫీ అంటే ప్రాణమని అప్పుడే తెలిసింది. కాఫీ పంపకుంటే హౌస్‌లో ఉండనని కూడా శివాజీ తెగేసి చెప్పాడు. అలాంటి కాఫీ పౌడర్‌ను గుర్తు పెట్టుకుని మరీ పల్లవి ప్రశాంత్ గిఫ్ట్‌గా ఇచ్చేసరికి శివాజీ చాలా హ్యాపీ ఫీలయ్యాడు.

Google News