ఆయన్ను అమ్మాయిలే కాదు.. అబ్బాయిలూ ప్రేమిస్తారు: శ్రుతిహాసన్

ఆయన్ను అమ్మాయిలే కాదు.. అబ్బాయిలూ ప్రేమిస్తారు: శ్రుతిహాసన్

నటి శ్రుతిహాసన్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కలిసి ఒక మ్యూజికల్ వీడియో ఆల్బమ్ చేసిన విషయం తెలిసిందే. కమలహాసన్‌ రాసిన తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందించిన పాటకు శ్రుతిహాసన్‌ బాణీలు కట్టింది. అంతేకాకుండా స్వయంగా పాడడంతో పాటు, అందులో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌తో కలిసి శ్రుతి హాసన్ నటించడం విశేషం. తొలుత ఈ పాటకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చి సంచలనంగా మారింది.

ఇక ఈ ప్రత్యేక ఆల్బమ్‌కు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ‘ఇనిమేల్’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ మ్యూజికల్ వీడియో ఆల్బమ్‌కు సంబంధించిన ప్రమోషన్ టీజర్ తాాజగా విడుదలైంది. దీనికి విపరీతమైన స్పందన వస్తోంది. తాజాగా ఈ పాట ప్రమోషన్ కార్యక్రమాలను సైతం శ్రుతి, లోకేష్‌లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వీరిద్దరూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆయన్ను అమ్మాయిలే కాదు.. అబ్బాయిలూ ప్రేమిస్తారు: శ్రుతిహాసన్

శ్రుతి హాసన్ ఈ వీడియో ఆల్బమ్ కోసం తననెందుకు ఎంపిక చేశారో తెలియదు కానీ ఆమె క్రియేటివిటీని చూసి మాత్రం అవాక్కయ్యానని లోకేష్ తెలిపారు. శ్రుతి హాసన్‌కు లవర్‌లా ఎలా నటించగలిగారు.. మీకు ఎక్స్ లవ్ వంటిది ఏమైనా జరిగిందా? అంటే అలాంటిదేమీ లేదని కాస్త సిగ్గుపడుతూ లోకేష్ బదులిచ్చారు. ఇక శ్రుతి హాసన్ దీనిపై మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్‌ని లవ్ చేయని వారుండరని.. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా ఆయన్ను లవ్ చేస్తారని తెలిపింది. ఇప్పుడీ కామెంట్ తెలగ వైరల్ అవుతోంది.