సన్నగా అయ్యిందని.. ఆ సినిమా నుంచి కీర్తి సురేష్‌ని తప్పించారట..

సన్నగా అయ్యిందని.. ఆ సినిమా నుంచి కీర్తి సురేష్‌ని తప్పించారట..

కీర్తి సురేష్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘మహానటి’. ఆమె కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నా కూడా మొదట గుర్తొచ్చేది మాత్రం మహానటే. లెజెండరీ నటి సావిత్రి పాత్రలో కీర్తి జీవించేసింది. ఎన్నో అవార్డులను ఈ సినిమాకు అందుకుంది. కానీ స్టార్ స్టేటస్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇక అమ్మడు బాలీవుడ్‌లో సైతం అడుగు పెట్టింది. అక్కడ వరుణ్ దావన్‌కి జంటగా నటిస్తోంది.

అయితే కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో చాలా స్లిమ్ అయిపోయింది. ఇదే ఆమెకు అవకాశాలను దూరం చేస్తోంది. వరుణ్ ధావన్‌తో కంటే ముందే బాలీవుడ్‌లో ‘మైదాన్’ సినిమా అవకాశం కీర్తి సురేష్‌కే మేకర్స్ ఇవ్వాలనుకున్నారట. ఈ సినిమా పేరు ‘మైదాన్’. ఈ సినిమాలో కీర్తి సురేష్.. అజయ్ దేవగన్‌తో కలిసి నటించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ అవకాశం కీర్తిని కాదనుకుని ప్రియమణికి వెళ్లిపోయింది.

సన్నగా అయ్యిందని.. ఆ సినిమా నుంచి కీర్తి సురేష్‌ని తప్పించారట..

ఈ విషయాన్ని స్వయంగా మైదాన్ మూవీ మేకర్సే తెలిపారు. మైదాన్ దర్శకుడు అమిత్ శర్మ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. అజయ్ దేవగన్‌కి భార్య పాత్రలో తొలుత కీర్తి సురేష్‌ను అనుకున్నామని అయితే ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించామన్నారు. కీర్తి బరువు తగ్గి సన్నగా మారడంతో ఆమె ఆ పాత్రకు సెట్ కాలేదని అందుకే ప్రియమణితో ఈ సినిమా చేసినట్టు అమిత్ వెల్లడంచారు. కొన్ని సార్లు సన్నగా ఉన్నా ఇబ్బందే.. 

Google News