టాలీవుడ్ హీరోలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

మంచువారబ్బాయి హీరో విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రాన్ని మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో విష్ణు 100 శాతం సక్సెస్ అయితే సాధించాడు. ఈ సినిమాలో అగ్ర హీరోలు నటిస్తున్నారంటూ లీక్స్ ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి జనాల్లో బీభత్సంగా పెరిగిపోయింది. అంతే కాకుండా ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా సినిమాపై బజ్‌ను పెంచాయి.

ఈ సినిమాను మంచు విష్ణు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను దాదాపు న్యూజిలాండ్‌లోనే నిర్వహిస్తున్నాడు. మొత్తానికి మంచు విష్ణు పేరైతే కన్నప్ప సినిమాతో నెట్టింట మారుమోగుతోంది. గత పరాజయాలన్నింటినీ లైట్ తీసుకుని మంచి పాజిటివ్ వేలో ముందుకు అయితే వెళుతున్నాడు. ఇక తాజాగా తన సినిమా విషయాన్ని మాత్రం హైడ్ చేసి తెలుగు హీరోల గురించి మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ‌విభూష‌ణ్ అందుకున్నార‌ని వెల్లడించాడు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ హీరో అయిన బ‌న్నీ కేర‌ళ‌లో అసాధార‌ణ‌ ఫాలోయింగ్‌తో దూసుకెళుతున్నాడన్నారు. ఇక ఇండియాలోనే అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్ అని ఆకాశానికి ఎత్తేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుని అన్నగా సంబోదిస్తూ ఆయన నటిస్తున్న 29వ చిత్రం దేశంలో అతి పెద్ద సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

Google News