పిల్లలనెప్పుడు కంటారంటే బిగ్‌బాస్ బ్యూటీ ఏం చెప్పిందో తెలుసా?

పిల్లలనెప్పుడు కంటారంటే బిగ్‌బాస్ బ్యూటీ ఏం చెప్పిందో తెలుసా?

వరుణ్ సందేశ్, వితికా షెరు.. ఈ జంట గురించి తెలియని తెలుగు వారు ఉండరు. మొట్టమొదటిసారిగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టిన కపుల్ వీరే. గతంలో హీరోహీరోయిన్లుగా వీరిద్దరూ జనాలకు పరిచయమైనా కూడా బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక వితిక అయితే ఇప్పటికీ యూట్యూబ్ వీడియోలతో అభిమానులకు ప్రతిరోజూ టచ్‌లో ఉంటూనే వస్తోంది.

ఇక అభిమానుల నుంచి వితికకు ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్నేంటో తెలుసా? పిల్లల్ని ఎప్పుడు కంటారు అని. ఈ ప్రశ్నకు తాజాగా రిప్లై ఇచ్చింది వితిక.. అది కూడా చాలా ఫన్నీగా. పిల్లల్ని ఎప్పుడు కంటారని తనను నిత్యం అడుగుతూనే ఉణ్నారని.. కాబట్టి ఈ పిల్లవాడు పెద్దయ్యాక కటంటానని తన భర్త వరుణ్ సందేశ్ తన ఒడిలో నిద్రిస్తున్న ఫోటోను షేర్ చేసింది.

తన భర్త ఇంకా పిల్లాడేనని వితిక చెప్పకనే చెప్పేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఈ జంట ఒకరి పట్ల ఒకరు చూపిన ప్రేమ..సందేశ్‌పై వితిక కేరింగ్ జనాలకు తెగ నచ్చేసింది. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా షూటింగ్‌లో నిజంగా లవ్‌లో పడ్డారు. 2016లో ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. పెళ్లై దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా కూడా వీరిద్దరికీ పిల్లలు లేరు. అందుకే నెటిజన్లు పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. 

Google News