శృతిహాసన్‌తో ఓ రేంజ్‌లో డైరెక్టర్ రొమాన్స్.. నెటిజన్ల షాక్..

శృతిహాసన్‌తో ఓ రేంజ్‌లో డైరెక్టర్ రొమాన్స్.. నెటిజన్ల షాక్..

డైరెక్టర్స్ సినిమాల్లో కనిపించిన దాఖలాలు చాలా తక్కువే. కొందరు మాత్రం ఏదో ఒక సీన్‌లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. మగధీర చిత్రంలో రాజమౌళి మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో వివి వినాయక్.. ఇలా కొందరు మాత్రమే అది కూడా ఏదో ఒక సీన్‌లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఇక డైరెక్టర్స్ సినిమాల్లో రొమాన్స్ చేయడమనేది చాలా అరుదు. కానీ ఒక డైరెక్టర్ మాత్రం రెచ్చిపోయి హాట్ టాపిక్ అవుతున్నారు.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. లోకేష్ కనగరాజ్. లియో మూవీతో మంచి హిట్‌ను లోకేష్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా నటుడి అవతారమెత్తిన లోకేష్.. తన తొలి వీడియోలోనే శృతి హాసన్‌తో రొమాన్స్‌తో రెచ్చిపోయారు. శృతి హాసన్‌తో ఆయన ఆ రేంజ్‌లో రొమాన్స్ చేయడం చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఇది సినిమా కాదులెండి. వీరిద్దరూ ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో కోసం కలిసి నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.

శృతిహాసన్‌తో ఓ రేంజ్‌లో డైరెక్టర్ రొమాన్స్.. నెటిజన్ల షాక్..

ఈ వీడియోలో లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించారు. దీనిని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తున్నారు. ఇక ఈ ప్రోమోలో మ్యూజిక్ మాత్రం పెద్ద లేదు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో వారిద్దరి కెమిస్ట్రీకే మార్కులు ఎక్కువగా పడుతున్నాయి. ప్రోమో చూసిన ఫ్యాన్స్ ఒక డైరెక్టర్‌ మరీ ఇంతలా రొమాంటిక్‌గా ఉంటారా? అని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది.