రాజమౌళి కుటుంబానికి జపాన్‌లో తప్పిన పెను ప్రమాదం

రాజమౌళి కుటుంబానికి జపాన్‌లో తప్పిన పెను ప్రమాదం

దర్శకధీరుడు రాజమౌళి కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లారు. ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్ కోసం వారంతా అక్కడకు వెళ్లారు. అయితే వారు అక్కడున్నప్పుడే స్వల్ప భూకంపం వచ్చిందట. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. జపాన్‌లో తామంతా ఓ పెద్ద బిల్డింగ్‌లోని 28వ ఫ్లోర్‌లో ఉన్నామని.. అప్పుడు ఎందుకో సడెన్‌గా బిల్డింగ్ కదులుతున్నట్టుగా అనిపించిందని కార్తికేయ తెలిపాడు.

కాసేపటి తర్వాత అది భూకంపమని తెలిసిందని కార్తికేయ వెల్లడించాడు. ఆ సమయంలో తాము చాలా భయాందోళనకు గురైనట్టు వెల్లడించారు. మొదటిసారిగా  భూకంపం ద్వారా కలిగే అనుభూతిని చెందానని ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా.. ఆ సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌ని సైతం ఫోటో తీసి దానిని ట్విటర్‌లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఇక కార్తికేయ పేర్కొంటున్న సమయంలో భూకంప తీవ్రత 5.3గా నమోదయింది. దీనిని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. నిజానికి జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణంగానే వస్తూ ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ జపాన్‌ను ఓ భారీ భూకంపం కుదిపేసింది. నూతన సంవత్సర వేడుకల్లో దేశం మునిగిపోయిన సమయంలో సంభవించిన భూకంపంలో 60 మంది చనిపోయారు. ప్రస్తుతం రాజమౌళి కుటుంబం క్షేమంగా తిరిగి ఇండియాకు రావాలని నెటిజన్లు కోరుతున్నారు.

Google News