మళ్లీ తెరపైకి గ్లోబల్ స్టార్ వార్.. రామ్ చరణ్‌కు ఇవ్వొద్దంటూ రచ్చ..

మళ్లీ తెరపైకి గ్లోబల్ స్టార్ వార్.. రామ్ చరణ్‌కు ఇవ్వొద్దంటూ రచ్చ..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ‘గ్లోబర్ స్టార్’ ఎవరనేది నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకరకంగా ఫ్యాన్ వారే జరిగింది. ఈ సినిమాలో చేసిన స్టార్ హీరోలిద్దరూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్టింట పెద్ద యుద్ధమే చేశారు. గ్లోబల్ స్టార్ మా హీరో అంటే మా హీరో అంటూ రచ్చ రచ్చ చేశారు. అయితే చివరికి ఈ ట్యాగ్ మాత్రం రామ్ చరణ్‌కే అఫీషియల్‌గా వెళ్లిపోయింది.

అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో తిరిగి ‘మెగా పవర్ స్టార్’ టైటిల్ హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ ట్యాగ్ ను ‘గ్లోబల్ స్టార్’ గా మార్చారు. దీంతో తిరిగి ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది. రామ్ చరణ్‌కి అదేం ట్యాగ్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ గోలంతా ఎందుకులే అనుకున్నారేమో కానీ ‘గేమ్ చేంజర్’ మూవీ మేకర్స్ గ్లోబర్ స్టార్ ట్యాగ్ జోలికే వెల్లడం లేదు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. నేడు చెర్రీ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో గ్లోబల్ స్టార్ అని కాకుండా, మెగా పవర్ స్టార్ అనే ప్రస్తావించడం మెగా ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్‌కు గురి చేసింది. గేమ్ చేంజర్ నుంచి విడుదలైన ఈ ఒక్క పోస్టరే కాదు.. ఇటీవల విడుదలైన అన్ని అప్డేట్స్‌లోనూ చెర్రీకి పాత ట్యాగే చిత్ర యూనిట్ వాడుతోంది.