నెట్టింట సెగలు పుట్టిస్తున్న అనసూయ.. రౌడీ బేబీ అంటూ రెచ్చిపోతున్న నెటిజన్స్

నెట్టింట సెగలు పుట్టిస్తున్న అనసూయ.. రౌడీ బేబీ అంటూ రెచ్చిపోతున్న నెటిజన్స్

జబర్దస్త్ షోతో స్టార్ యాంకర్‌గా మారి.. ఆపై సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని బుల్లితెరను పూర్తిగా వదిలేసింది అనసూయ. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్లు తప్ప నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న నటీమణులంతా అత్తగానో, అమ్మగానో నటిస్తూ కాలం గడిపేయాల్సిందే కానీ అనసూయ మాత్రం మంచి క్రేజీ పాత్రలు దక్కించుకుంటోంది.

ఇక అనసూయూ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్.. ఫోటో షూట్స్‌కి సంబంధించి అన్ని విషయాలనూ పంచుకుంటూ ఉంటుంది. తరచూ అనసూయ ఏవో ఒక ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు బికినీలో.. మరికొన్ని సార్లు పద్ధతిగా శారీలో. ఎలాంటి ఫోటోలు అయినా సరే.. నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. అనసూయ ఫోటోలపై ట్రోల్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయి.

నెట్టింట సెగలు పుట్టిస్తున్న అనసూయ.. రౌడీ బేబీ అంటూ రెచ్చిపోతున్న నెటిజన్స్

అయినా సరే.. అనసూయ ఏమాత్రం తగ్గదు. స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చుకుంటూనే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆరెంజ్ కలర్ శారీలో ఓ ఫోటో షూట్ చేసింది అనసూయ. ఆమె ఇచ్చిన ఫోజులు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. నెటిజన్లను ఈ పిక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. పైగా బ్లూ కలర్ గ్లాసెస్‌తో యూత్‌ను తెగ కవ్విస్తోంది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. నెట్టింట అనసూయ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రౌడీ బేబీ అంటూ నెటిజన్లు రెచ్చిపోయి మరీ కామెంట్స్ పెడుతున్నారు.

Google News