క్లీంకారను చూశారా? అందానికి ఐకాన్‌లా ఉంది..

క్లీంకారను చూశారా? అందానికి ఐకాన్‌లా ఉంది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకారను చూశారా? మైండ్ బ్లోయింగ్ ఆ చిన్నారి అందం. గత ఏడాది జూన్ 20న రామ్ చరణ్ దంపతులకు పాప జన్మించింది. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవు. పాపకు క్లీంకారగా నామకరణం చేశారు. మెగాస్టార్ చిరంజీవి పాపను ఉయ్యాలలో వేసి క్లీంకారగా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక పాప జన్మించి 9 నెలలు అయ్యింది. అయినా సరే.. చిన్నారి ఫేస్ ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. ఎన్నోసార్లు క్లీంకారను బయటకు తీసుకొచ్చినా కూడా ఫేస్‌ను కనిపించనివ్వకుండా కవర్ చేసేవారు. ఇటీవల వైజాగ్ బీచ్‌లో కూడా రామ్ చరణ్ దంపతులు తమ కూతురితో కలిసి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

క్లీంకారను చూశారా? అందానికి ఐకాన్‌లా ఉంది..

ఇక ఈ సమయంలోనూ పాప ఫేస్ అయితే రివీల్ కానివ్వలేదు. కానీ నేడు రివీల్ అయిపోయింది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చెర్రీ దంపతులు కూతురు క్లీంకకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో చెర్రీ దంపతులు ఆలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది. తల్లి పొత్తిళ్ల నుంచి అమాయకంగా చూస్తున్న క్లీంకార ఫేస్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. చూపరులను మొహం తిప్పుకోనివ్వడం లేదు.