లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్.. ఆ ఇంటి విశేషాలేంటో తెలిస్తే..

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్.. ఆ ఇంటి విశేషాలేంటో తెలిస్తే..

నేషనల్ స్టార్ ప్రభాస్ గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు స్పీడ్ పెంచేశాడు. బాహుబలి రెండు పార్టులు, ఆ తరువాత సాహో కోసం చాలా టైమ్ వెచ్చించాడు. దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసమే ప్రభాస్ పని చేశాడు. ఇప్పుడు అలా కాకుండా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సాహో నుంచి వరుస ఫ్లాపులు కొట్టిన ప్రభాస్.. తిరిగి సలార్ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

ఇక ప్రభాస్ లండన్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల కథనం ప్రకారం.. వెకేషన్‌ లేదా సినిమా షూటింగ్‌ల కోసం లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ నివాసం ఉండేలా ప్రభాస్‌ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. తరుచూ లండన్‌కు సినిమా షూటింగ్‌ల కోసం వెళుతూ ఉండటంతో ఇక అద్దెకు వద్దని సొంత ఇల్లు కావాలని భావించారట. ఈ క్రమంలోనే అద్దెకు తీసుకున్న ఇంటినే ఇప్పుడు ప్రభాస్‌ సొంతం చేసుకున్నారట.

ఇక ప్రభాస్ ఇల్లు అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? చాలా లావిష్‌గా ఉంటుందట. దానిని తన అభిరుచికి తగ్గట్లుగా గ్రాండ్‌గా ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించుకున్నాడట. మొత్తానికి ప్రభాస్ లండన్‌లోనూ ఓ ఇల్లు కొనేశాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజాసాబ్‌’ షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఈ రెండు సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ ఏడాది వేసవి తర్వాత ‘సలార్’ పార్ట్ 2ని షురూ చేస్తాడట.

Google News