పవన్ పిలుపు కోసం వెయిటింగ్..: అనసూయ

పవన్ పిలుపు కోసం వెయిటింగ్..: అనసూయ

ప్రముఖ నటి అనసూయ బుల్లితెర నుంచి వెండితెరకు తన ప్రస్థానాన్ని సాగించింది. ఇక వెండితెరపై కూడా అవకాశాల మీద అవకాశాలు రాబడుతోంది. ఇక తనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలవాలే కానీ ఎన్నికల ప్రచారానికి కూడా వెనుకాడబోనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ ఇంటర్వ్యూలు పలు ఆసక్తికర విషయాలపై అనసూయ స్పందించింది. జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నటి అనసూయ తెలిపారు.

డేట్స్‌ సర్దుబాటు కాకపోవడం వల్లే జబర్దస్త్‌ మానేశానని.. ఇప్పటికీ కుదిరినప్పుడల్లా సెట్స్‌కు వెళ్తుంటానని అనసూయ తెలిపింది. ఇక రాజకీయాల పట్ల ఆసక్తి అయితే లేదు కానీ పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే మాత్రం వెళతానని వెల్లడించింది. తనకు పార్టీలతో పని లేదని లీడర్స్‌ ముఖ్యమని.. ఏ లీడర్‌ నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపింది. జనసేన లీడర్‌ తనను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనసూయ మనసులో మాట చెప్పేసింది.

పవన్ పిలుపు కోసం వెయిటింగ్..: అనసూయ

ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో ఆమె డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా అనసూయ స్పందించింది. కోట చాలా పెద్దవారని.. సినిమాల్లో నెగెటివ్‌ రోల్స్ ఆయన చేసినట్టు మరెవరూ చేయలేరని తెలిపింది. తనను కోట తన ఇంట్లో మనిషిలా అనుకున్నారని.. వాళ్ల భార్య, కూతురు ఎంతో తననూ అలానే భావించారని వెల్లడించింది. ఆయన కొంచెం పాతకాలం వ్యక్తి కాబట్టి తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ నచ్చలేదని.. అదే విషయాన్ని కోట చెప్పారని.. దాన్ని చిలవలు పలవలు చేసి రాసుకొచ్చారని అనసూయ తెలిపింది. 

Google News