‘జరగండి’ పాటపై ఫైర్ అవుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్..

Jaragandi Song

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి’ పాట రూపంలో ఒక ట్రీట్‌ను అయితే మేకర్స్ అందించారు. ఈ పాటను దాదాపు 18 కోట్లు ఖర్చుపెట్టి చిత్రీకరించామని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు.

ఏదో సింపుల్ బడ్జెట్‌తో తీసిన పాటలే సూపర్ డూపర్ హిట్ అయి జనం మదిలో నిలిచిపోతున్నాయి. అలాంటిది 18 కోట్లు ఖర్చుపెట్టి తీసిన పాట ఎలా ఉండాలి? అంతెందుకు.. నాటు నాటు సాంగ్‌కి ఎంత ఖర్చు అయ్యుంటుంది? ఆ పాట ఆస్కార్ రేంజ్‌కి వెళ్లిపోయింది. మరి ఈ పాటపై ఫ్యాన్సే పెదవి విరుస్తున్నారు. ఈ స్థాయిలో ఖర్చు పెట్టి తీసిన పాట ఇదా అని చిత్ర యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు.

Jaragandi Song

ఏమాత్రం ఆకట్టుకునే స్థితిలో లేని పాట కోసం అంత ఖర్చు చేశామని గొప్పలు చెబుతున్నారా? అంటూ చెర్రీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ పాటను కూడా తమన్ కాపీ కొట్టాడని అంటున్నారు. శక్తి సినిమాలోని రామ చక్కని రసగుల్లా.. పాట ప్రారంభంలో వినిపించే కోరస్‌ను తమన్ జరగండి పాట కోసం కాపీ కొట్టాడని ఫైర్ అవుతున్నారు.  ఇక జరగండి సాంగ్ తెలుగులో 24 గంటల్లో 4.5 మిలియన్ వ్యూస్.. దాదాపు 3 లక్షల లైక్స్ సొంత చేసుకోగా హిందీలో 25 వేల లైక్స్ సంపాదించింది.

Google News